News October 13, 2024
కోట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి
చిల్లకూరు మండలం, కోట క్రాస్ రోడ్డు సమీపంలో గత రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన క్షతగాత్రుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించే క్రమంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2024
నెల్లూరు జిల్లాలో దారుణ హత్య
భార్యను భర్త హత్య చేసిన ఘటన బోగోలు మండలంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. విశ్వనాథనావుపేటకు చెందిన దత్తు.. తస్లీమా(35)ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దత్తు మంగళవారం రాత్రి గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 13, 2024
నెల్లూరు: DSC పరీక్షలకు ఉచిత శిక్షణ
ఏపీ బీసీ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు DSC పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి కే ప్రసూన ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ BC, SC,ST, EBC అభ్యర్థులు అర్హులన్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రు.లక్ష లోపు ఉండి, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు BC స్టడీ సర్కిల్‌లో 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 13, 2024
మంత్రికి వెంకటగిరి ఎమ్మెల్యే వినతి
వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. విజయవాడలో మంత్రి నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉద్యోగ సిబ్బంది కొరత ఉందని.. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.