News December 17, 2024
కోట: భారీ కొండచిలువ కలకలం..
కోట మండలం మద్దాలి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలోని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను బయట కట్టేసి నిద్రిస్తున్న సమయంలో కొండచిలువ అతని ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అడ్డుకోవడంతో కొండచిలువ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రజలు భయపడుతున్నారు.
Similar News
News January 16, 2025
ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్
ఈ నెల 18, 19, 20వ తేదీలలో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఈ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాలలో ప్రజలందరికి ఈ సమాచారం అందించాలన్నారు. పండుగకు వచ్చే సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 16, 2025
నెల్లూరు: తిరుగు ప్రయాణంలో నిలువ దోపిడి
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్లేవారికి ప్రయాణం ఖరీదుగా మారింది. నెల్లూరుజిల్లా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి RTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. దీంతో వారు టికెట్ రేట్లను రెండింతలు పెంచి నిలువ దోపిడి చేస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిరావడంతో ప్రజలు అధిక ధరలు చెల్లించి ప్రయాణిస్తున్నారు.
News January 16, 2025
నెల్లూరు: మహిళపై అత్యాచారయత్నం
ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సంగం మండలంలో చోటుచేసుకుంది. సిద్దీపురం గ్రామానికి చెందిన నాయబ్ రసూల్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై బుధవారం మధ్యాహ్నం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.