News October 7, 2024

కోట సీడీపీఓ మునికుమారికి మెమో జారీ

image

కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మునికుమారికి సోమవారం మెమో జారీ చేసినట్టు తిరుపతి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కోట ప్రాజెక్టు పరిధిలోని 9 సెక్టార్ల పరిధిలో గల 200 మంది ఆయాలచే కోటలోని ప్రాజెక్టు కార్యాలయంలో బాత్రూములు, మరుగుదొడ్లు కడిగించడం, కార్యాలయం, ఆవరణమంతా శుభ్రం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, ముగ్గులు వేయించడం చేశారు. దీంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు.

Similar News

News December 11, 2025

నెల్లూరు: శిక్షణ పూర్తయినా.. తప్పని నిరీక్షణ.?

image

మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టింది. 3 నెలల పాటు ఈ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయి 3నెలలు అయినా మిషన్లు అందలేదు. మహిళలు 3 నెలల నుంచి కుట్టు మిషన్లు, ధ్రువ పత్రాలు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 31 శిక్షణా కేంద్రాల్లో 1808 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వారికి మిషన్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.

News December 11, 2025

నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

image

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.

News December 11, 2025

నెల్లూరు: నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్

image

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. ప్రతి బృందానికి SI స్థాయి అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉంటారని చెప్పారు. జిల్లాలో 6 స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వ్యవస్థను మరింత చురుగ్గా, సమయస్ఫూర్తితో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.