News February 10, 2025
కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
Similar News
News December 13, 2025
వేములవాడ: మార్కెట్ ఛైర్మన్‌పై దాడి.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: SP

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై ఈ మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.
News December 13, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. నిషేధాజ్ఞలు అమలు

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 14న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.


