News January 11, 2026

కోడిపందాలు ఆడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఈ సంక్రాంతి పండుగను కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర హైకోర్టు కోడిపందాలను నిషేధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా పందాల నిర్వహణకు స్థలాలు లీజుకు ఇచ్చినా, పందాలను ప్రోత్సహించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 18, 2026

‘గ్రీన్‌లాండ్‌ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.

News January 18, 2026

కురబలకోట: వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు

image

కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లిలో వేటగాళ్లు పునుగు పిల్లిని వేటాడడం శనివారం వెలుగులోకి రావడం తెలిసిందే. నిందితులను పట్టు కునేందుకు అన్నమయ్య జిల్లా ఫారెస్ట్, మదనపల్లె అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి, వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పునికి పిల్లిని ప్రాణాలతో పట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

News January 18, 2026

జగిత్యాల: ఐదు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించి, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.