News January 7, 2025
కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టండి : కలెక్టర్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోడి పందాలు జరగకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 25, 2025
నెల్లూరు: 104 అంబులెన్సుల్లో డ్రైవర్ ఉద్యోగాలు
కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.
News January 25, 2025
దుత్తలూరు: మసిబారుతున్న పసి బతుకులు
దుత్తలూరు మండలంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో బొగ్గుబట్టీలు, ఇటుక బట్టీలు, కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. కాలుష్యం నడుమ వారి ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బట్టీల వద్ద కార్మిక చట్టాలు అమలుకావటం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వాపోయారు.
News January 25, 2025
కావలి వెంకటేశ్వర థియేటర్‌కు నోటీసులు జారీ
కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.