News January 5, 2025

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: SP

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదం, గుండాట ఇతర నిషేధిత ఆటలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోడి పందాలు ఆడడానికి బరులు ఇచ్చినా, నిర్వహించినా, పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన, ఆడిన వారి పై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.

Similar News

News January 17, 2025

ఏలూరు: అధికారులను మెచ్చుకున్న మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు బేష్ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం జిల్లా అధికారులను అభినందించారు. రూ.734 కోట్ల విలువైన 3.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని అన్నారు. 96% రైతులకు 24 గంటల్లోనే సొమ్ము చెల్లించినట్లు వివరించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటిగా ఏలూరులోనే ప్రారంభమైందన్నారు. ధాన్యం సేకరణపై అధికారుల చొరవ ప్రశంసనీయమన్నారు. 

News January 16, 2025

భీమవరంలో కిడ్నాప్ కలకలం

image

భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటకి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ గురువారం కిడ్నాప్ అయ్యారు. సత్యనారాయణ తమ బంధువులను టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించడానికి వచ్చి బయటికు వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వారి కారులో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కి ఆర్థిక లావాదేవీలే కారణం అని పలువురు అంటున్నారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2025

ప.గో జిల్లాను పచ్చగా నిర్మించుకుందాం: కలెక్టర్ నాగరాణి

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ గ్లాసులను నిషేధిస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను పచ్చగా నిర్మించుకుందామని, అందరూ సహకరించాలని, ఆంక్షలు మీరితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.