News August 25, 2024
కోడి పందేలు.. 19 మందిపై కేసులు

పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం అడవుల్లో కోడి పందేల శిబిరంపై ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం దాడి చేశారు. 10 బైక్లు, 17 ఫోన్స్, 2 కోడి పుంజులతో పాటు రూ.3,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కోడి పందేలు, పేకాట ఆడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.
News November 22, 2025
నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

నెల్లూరు రూరల్లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 22, 2025
నెల్లూరు: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలిగిరిలో జరిగింది. ఏపినాపి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్కు సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు ప్రకాశం(D) పామూరులో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.


