News March 18, 2025
కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.
Similar News
News March 19, 2025
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు.
News March 18, 2025
ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
News March 18, 2025
దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.