News April 6, 2025
కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బాలికకు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి, మోసం చేశాడు. తీరా ముఖం చాటేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
వాట్సప్ సేవలను ఉపయోగించుకోవాలి: కర్నూల్ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూల్ కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు” పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, డిఆర్ఓ వెంకట్ నారాయణమ్మతో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తుందన్నారు.
News April 21, 2025
ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రీవెన్స్ వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిఎల్డిఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.
News April 21, 2025
ఆర్జీదారుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్

ప్రజల నుంచి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. అదోనిలోని సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్- పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. సమస్య ప్రాధాన్యతను బట్టి ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.