News October 4, 2024

కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ

image

కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.

Similar News

News November 6, 2024

నూజివీడు త్రిపుల్ ఐటీలో 25 అంశాలలో పోటీల నిర్వహణ

image

నూజివీడు త్రిపుల్ ఐటీలో యువతరం కార్యక్రమం పేరిట సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, లలిత కళలు అనే ఐదు విభాగాల నుంచి 25 అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటి 8, శ్రీకాకుళం 6, ఇడుపులపాయ 5, ఒంగోలు త్రిపుల్ ఐటీలు 4 స్థానాల్లో అర్హత సాధించాయి. ఈ పోటీల్లో ఎంపికైన వారు వచ్చే నెల 26 నుంచి 30 వరకు కాంచీపురంలో నిర్వహించే సౌత్ జోన్ పోటీల్లో ఆర్జీయూకేటీ తరఫున పాల్గొననున్నారు.

News November 5, 2024

విజయవాడ: కాదంబరి జెత్వానీ కేసులో కీలక అప్డేట్

image

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 7కి వాయిదా వేసింది. విద్యాసాగర్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విద్యాసాగర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

News November 5, 2024

విజయవాడ: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.