News September 25, 2024
కోడూరు: నామినేటెడ్ పోస్టు వద్దంటూ సీఎంకు లేఖ

ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా ఇచ్చిన పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఈయన కోడూరు నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News November 13, 2025
కడప: ల్యాబ్‌లో సీతాకోకచిలుకల ఉత్పత్తి

కడప జిల్లాలోని వైవీయూ సరికొత్త ప్రయోగం చేపట్టింది. జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి HOD డా.ఎస్పీ వెంకటరమణను పలువురు అభినందించారు. రిజిస్టర్ ప్రొ.పద్మ, డీన్ ప్రొ. ఏజీ దాము పాల్గొన్నారు.
News November 13, 2025
ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.


