News May 24, 2024
కోడూరు: బైకు, లారీ ఢీ.. ఒకరు మృతి

రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని అప్పరాజుపేట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెనగలూరు మండలం కొండూరుకు చెందిన పసుపులేటి సుబ్బ నరసయ్య మృతి చెందగా, తోట వెంకటరమణ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 16, 2025
కడప: చాడీలు చెప్పాడని కత్తితో దాడి

కడప నగరంలో యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఎర్రముక్కపల్లి సమీపంలోని చికెన్ అంగడి యజమాని అస్లాం వద్ద ఇర్ఫాన్, ఖలీల్ పనిచేస్తున్నారు. ఖలీల్, ఇర్ఫాన్‌పై చాడీలు చెప్పడంతో యజమాని ఇర్ఫాన్‌ను పనిలో నుంచి తీసేశాడు. దీంతో ఆగ్రహించిన ఇర్ఫాన్ ఖలీల్‌పై కత్తితో శనివారం దాడి చేశాడు. గాయపడిన ఖలీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖలీల్ ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
News February 16, 2025
కడపలో భార్యను కడతేర్చిన భర్త అరెస్టు

కడప బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి భార్యను కిరాతగంగా భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంమండి వీధిలో నివాసముండే జమీల భాను(32) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. కాగా నిందితుడికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
News February 16, 2025
ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: కడప ఎస్పీ

జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కడపలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు. అంతకుముందు శిక్షణా కేంద్రంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.