News September 21, 2024

కోడూరు: మృత్యువుతో పోరాడి చిన్నారి మృతి

image

ఓ చిన్నారి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన కొక్కంటి మహేశ్ మూడు రోజుల క్రితం తండ్రి పెద్ద కర్మ పనుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్ కూతురు లాస్య(4) ప్రమాదవశాత్తు వంట పాత్రలో పడింది. గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న MLA శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Similar News

News October 10, 2024

ఎగ్జిబిషన్‌లు సృజనాత్మక ఆలోచనలను చిగురింపజేస్తాయి: కడప కలెక్టర్

image

పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు చిగురింపజేయడానికి స్పేస్ వీక్- 24 లాంటి ఎగ్జిబిషన్‌లు ఎంతో దోహదపడుతాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇస్రో, ఇతర విద్యా సంస్థలు నిర్వహించిన ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన కాంపిటీషన్స్ విజేతలకు ఆయన జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

News October 9, 2024

ముద్దనూరు వద్ద రైలు ఢీ.. యువకుడు మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముద్దనూరులో చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రామిరెడ్డి వివరాల ప్రకారం.. ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో రైలు కిందపడి గుండి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఇతను డ్రైవర్‌‌గా జీవనం సాగిస్తారన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల విరాలు తెలియాల్సిఉంది.

News October 9, 2024

కడప: జ్యోతి క్షేత్ర సమస్య కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి

image

గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.