News March 22, 2024

కోడూరు: విధుల నుంచి వాలంటీర్ తొలగింపు

image

కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.

Similar News

News November 6, 2025

కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

image

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.

News November 6, 2025

మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.

News November 6, 2025

పంట నష్టం నమోదు పారదర్శంగా జరుగుతుంది: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవికావని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత 7 రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.