News February 6, 2025

కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

image

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడని, తెల్లారెసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం బయటకు వచ్చింది. ఇద్దరు ఉద్యోగులు ఒకే సీరీస్ నంబర్లున్న టికెట్లను భక్తులకు విక్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాజీపేటకు చెందిన భక్తుడు నకిలీ టికెట్లు ఉన్నాయంటూ ఆలయం ఈవో రామల సునీతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ బోర్డులో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. నకిలీ టికెట్ల విక్రయం భద్రకాళి ఆలయంలో చర్చనీయాంశమైంది.

News December 9, 2025

చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

image

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News December 9, 2025

అల్లూరి జిల్లాలో రోడ్డెక్కనున్న నైట్ హల్ట్ బస్సులు

image

మావోయిస్టులు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు ప్రకటించడంతో గిరిజన ప్రాంతానికి వచ్చే నైట్ హల్ట్ బస్సులు సోమవారం వరకు పలు ప్రాంతాలకు నిలిపివేయడం, కొన్ని బస్సులు పోలీసు స్టేషన్ సమీపంలో ఉంచడం జరిగేది. నిన్నటితో వారోత్సవాలు ముగిసాయి. నేటి నుంచి నైట్ హల్ట్ బస్సు సర్వీసులు వై.రామవరం, రాజవొమ్మంగి, రెవళ్లు యధావిధిగా నడుస్తాయని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.