News February 6, 2025

కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

image

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడని, తెల్లారెసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

భువనగిరి జిల్లాలో మరికాసేపట్లో పోలింగ్

image

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు భువనగిరి, ఆలేరు, మోత్కూర్, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్టలో మొత్తం 104 వార్డుల్లో రెండు ఏకగ్రీవం కాగా 102 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,32,711 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News February 11, 2026

పురపోరుకు రంగారెడ్డి జిల్లా సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో పుర పోరుకు సిద్ధమైంది. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. సా.5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 437 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్ఎస్ నుంచి 122, బీజేపీ నుంచి 109 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ క్యారీ చేయండి.

News February 11, 2026

పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్‌ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.