News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
MBNR: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఫీజు చెల్లింపులకు నేడే తుది గడువు

డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-2024 మధ్య చేరిన డిగ్రీ 1వ, 3వ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించడానికి నవంబర్ 13 తుది గడువు అని పాలమూరు ఓపెన్ వర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే, 2022-2024 మధ్య MA, MCom, MSc కోర్సుల్లో చేరిన 2వ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని వివరించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
News November 13, 2025
చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

చింతపల్లిలో గురువారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం 17 డిగ్రీలు నమోదు కాగా.. గురువారం 12 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో, ఉష్ణోగ్రతలు మరింతగా దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలి పులి పంజాకు ప్రజలు గజగజలాడుతున్నారు.
News November 13, 2025
గాంధారిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 10.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మన్ దేవిపల్లి 11, ఎల్పుగొండ,బీబీపేటలో 11.1, నస్రుల్లాబాద్,లచ్చపేటలో 11.2, రామారెడ్డి,రామలక్ష్మణపల్లిలో 11.4, సర్వాపూర్ 11.5, డోంగ్లి 11.6, మేనూర్ 11.8, ఇసాయిపేట,జుక్కల్లో 11.9, బీర్కూర్ 12°Cలుగా నమోదయ్యాయి.


