News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
భద్రాద్రిలో భక్తులకు వైద్య భద్రత

భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లావైద్యఆరోగ్యశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ నెల 26 నుంచి 28 వరకు భద్రాచలం, పర్ణశాల, సారపాకల్లో 10 ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. 40 మంది వైద్యులు, 147 మంది సిబ్బంది 24 గంటల పాటు సేవలందించనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా 50 వేల ORS ప్యాకెట్లు సిద్ధం చేయగా, అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక వార్డులు, అంబులెన్సులను ఏర్పాటు చేశారు.
News March 17, 2026
వరంగల్ నిట్‌లో కొలువు సులువు!

వరంగల్ నగరంలోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో విద్యార్థులు సులభంగా కొలువులు పొందుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ విభాగాలకు చెందిన 1,201 మంది విద్యార్థులకు కొలువులు దక్కాయి. అత్యధికంగా రూ.64.3 లక్షల (CTC), సగటున రూ.14.35 లక్షల (CTC)తో 79.3 శాతం ఉద్యోగాలు పొందారు. గతంతో పోలిస్తే ఈసారి బహుళ జాతి కంపెనల సంఖ్య పెరిగిందని నిట్ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సుబూధి పేర్కొన్నారు.
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.


