News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
BHPL: నంబర్ ప్లేట్లు లేని వాహనాలను తక్షణం సీజ్ చేయాలి!

ఇసుక రవాణాలో పర్యవేక్షణ లోపం రావొద్దని, కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం ఐడీవోసీలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను తక్షణం సీజ్ చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలని స్పష్టం చేశారు.
News October 16, 2025
వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.
News October 16, 2025
నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.