News March 18, 2024
కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.
Similar News
News April 10, 2025
కర్నూలు జిల్లాలో ఎస్‌ఐల బదిలీ

కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక మహిళా ఎస్‌ఐ, ముగ్గురు ఆర్పీఎస్‌ఐలు, 14 మంది ఎస్‌ఐలు ఉన్నారు. వీఆర్‌లో ఉన్న ఐదుగురికి పోస్టింగులు దక్కాయి. తాజా బదిలీల్లో ఐదుగురు వీఆర్‌కు బదిలీ అయ్యారు. మొత్తంగా 18 మంది ఎస్‌ఐలు బదిలీ జాబితాలో ఉన్నారు.
News April 10, 2025
వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!

వెల్దుర్తిలో తహశీల్దార్ కార్యాలయంలో వింత ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కృష్ణ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అధికారులు నీకు ఎస్సీ కుల ధ్రువీకరణ నమోదు జాబితాలో లేదని చెప్పారన్నారు. చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఉందని, కానీ ఈ సం,, కుల ధ్రువీకరణ పత్రం తొలగించారని వాపోయారు. ఈ తప్పిదంతో ఎస్సీ కార్పొరేషన్ కోల్పోతానని వెల్లడించాడు.
News April 10, 2025
నేడు కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.