News November 15, 2024
కోదాడలో రైఫిల్ షూటింగ్ పోటీలు

కోదాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఎయిర్ రైఫిల్, పిస్టల్, పీప్ సైట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్ 17, 14 విభాగాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ అజం బాబా, పీడీలు మైసయ్య, వీవీ చారి, కొండలు, ప్రభాకర్, రంగారావు, నాని, అంజి క్రీడాకారులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.


