News March 8, 2025

కోదాడలో విజేతలకు బహుమతుల ప్రదానం 

image

క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని క్రికెటర్ బండారు అయ్యప్ప అన్నారు. కోదాడలోని కట్టకొమ్ముగూడెం రోడ్‌లో ఉన్న మైదానంలో కోదాడ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు తిలకించారు. విజేతలకు  బహుమతులను అందజేశారు. కాగా అయ్యప్ప  IPL 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 

Similar News

News November 16, 2025

జగిత్యాల: కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టు ఖాళీ

image

జగిత్యాల ధరూర్ క్యాంపులోనికేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టు కోసం అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అర్బన్ మండల విద్యాధికారి చంద్రకళ తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 17 నుంచి 19 వరకు జగిత్యాల కేజీబీవీలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. సెక్యూరిటీ ఏజెన్సీలలో శిక్షణ పొందిన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు.

News November 16, 2025

నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

HYD పరిసరాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. GHMC పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ HYDలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా BHEL 11.4, రాజేంద్రనగర్ 11.9, శివరాంపల్లి 12.2, గచ్చిబౌలి 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.

News November 16, 2025

ONGCలో 2,623 అప్రెంటిస్‌ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/