News March 1, 2025
కోదాడ: కలకలం రేపుతున్న మైనర్ మిస్సింగ్

కోదాడలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా.. మేళ్లచెర్వు మండలానికి చెందిన బాలికకు కోదాడకు చెందిన పదో తరగతి అబ్బాయి స్నాప్చాట్లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అతడిని కలవడానికి ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి కోదాడకు వెళ్లింది. ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 1, 2025
జగిత్యాల జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, నిరసనలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారం కోరారు.
News November 1, 2025
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందమూ సీఎంతో సమావేశమైంది. HYDలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని రేవంత్ కోరారు. సీఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది.
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.


