News March 18, 2025

కోదాడ: చోరీకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

image

చర్చిలో దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక చర్చిలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొత్త కిటికీలు, డోర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా కాపలా వ్యక్తులు గమనించి కేకలు వేశారు. పారిపోయే క్రమంలో రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News February 27, 2026

NHM తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ మిషన్(NHM) తూర్పు గోదావరి జిల్లాలో 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(స్పీచ్&లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు, GNM అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News February 27, 2026

ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్‌’

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్‌ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

లిక్కర్ కేసు.. తీర్పును సవాల్ చేయనున్న సీబీఐ!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు సంస్థ తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే స్కామ్‌లో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు.