News July 22, 2024
కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. తిర్మలగిరిసాగర్ మండలం అల్వాల వాసి కొండల్(19), అజయ్ కలిసి బైక్‌పై వెళ్తూ మిర్యాలగూడకు వెళ్తున్న RTC బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో కొండల్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన అజయ్‌ను మెరుగైన చికిత్స కోసం HYD తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు SI నర్సింహులు తెలిపారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.
News December 2, 2025
నల్గొండ: రేపు మూడో విడత నోటిఫికేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే NLG, CDR డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
News December 1, 2025
చండూర్: ఏకగ్రీవాల పేరుతో ఓటు హక్కు దోపిడీ: రఫీ

చండూర్ మండల బంగారిగడ్డ పంచాయతీ రిజర్వేషన్‌ను అగ్రకుల పెత్తందారులు తమ అనుచరులతో దుర్వినియోగం చేస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రఫీ సోమవారం నల్గొండలో ఆరోపించారు. స్థానిక ఎన్నికలను డబ్బు ప్రలోభాలతో ఏకగ్రీవం పేరుతో హరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు హక్కు హరించబడుతోందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలను చట్టపరంగా అడ్డుకుంటామని అన్నారు.


