News February 3, 2025

కోదాడ: తాగిన మైకంలో ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో జరిగింది. టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు.. కొండపల్లి జయంత్ (28) శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి జయంత్ తాగిన మైకంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

image

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.

News December 1, 2025

జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

image

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్‌డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.

News December 1, 2025

నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

image

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.