News March 30, 2025
కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు

సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం కోదాడ నుంచి వయా హుజూర్నగర్, మిర్యాలగూడెం వెళ్లే వాహనాలను పోలీసులు మళ్లించారు. లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
ADB: రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని, అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేశారు.
News November 24, 2025
కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీ

పరిపాలనా కారణాల దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని నలుగురు SIలను వేరే పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం మెమోరాండం జారీ చేసింది. కె.విజయ్ను మద్నూర్ నుంచి బిబిపేట్‌కు, ఎం.ప్రభాకర్‌ను బిబిపేట్ నుంచి దోమకొండకు, డి.స్రవంతిని దోమకొండ నుంచి కామారెడ్డి టౌన్‌కు జి.రాజును (వెయిటింగ్ రిజర్వ్) నుంచి మద్నూర్ పీఎస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News November 24, 2025
ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.


