News March 30, 2025

కోదాడ నుంచి హుజూర్‌నగర్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు

image

సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం కోదాడ నుంచి వయా హుజూర్‌నగర్, మిర్యాలగూడెం వెళ్లే వాహనాలను పోలీసులు మళ్లించారు. లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News April 19, 2025

ఘోరం: విద్యుత్ షాకిచ్చి.. గోళ్లు పీకి..

image

ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలోని ఓ ఐస్‌క్రీమ్ పరిశ్రమ యజమానులు ఇద్దరు కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దొంగతనం చేశారన్న అనుమానంతో వారిద్దరి దుస్తులు ఊడదీసి కరెంట్ షాకిచ్చారు. అనంతరం గోళ్లు పెకలించి హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 19, 2025

పార్వతీపురం: రేపు పాఠశాలలకు సెలవు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 220 రోజులు పని దినాలు పూర్తి కాకపోవడంతో రేపు పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డీఈవో రమాజ్యోతి గతంలో చెప్పారు. ఈస్టర్ పండగ కారణంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా గమనించాలని ఆమె ఈ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కన్నారు.

News April 19, 2025

జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

image

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.

error: Content is protected !!