News April 15, 2025
కోదాడ: పందెం కోడికి శస్త్ర చికిత్స

కోదాడలో కుక్కల దాడిలో కోడి గాయపడింది. ఎడమ రెక్క ఎముక రెండుగా చీలి పోయింది. యజమాని వైద్యం కోసం కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పెంటయ్య అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి రెండుగా పగిలిపోయిన ఎముకలను అతికించారు. యజమాని సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 2, 2025
భద్రాద్రి: సీఎం రాక.. సమస్యలపై స్పందిస్తారో చూడాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నిధుల కొరతతో నిలిచిన సీతారామ ప్రాజెక్టు పనులు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సత్తుపల్లి ఫుడ్పార్క్ సమస్యలపై సీఎం కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. నేటి పర్యటనలో ఆయన జిల్లాకు ముఖ్య నిర్ణయాలు ప్రకటిస్తారో లేదో అని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News December 2, 2025
ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
News December 2, 2025
ఖమ్మం: తొలిరోజే రూ.33 కోట్ల మద్యం విక్రయాలు

2025–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 204 వైన్ షాపుల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైరా ఐఎంఎల్ డిపో నుంచి ఏకంగా రూ.33 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఇందులో 38,685 మద్యం కేసులు, 17,298 బీరు కేసులు ఉన్నాయి. నెల రోజులుగా బ్రాండ్లు లేక ఇబ్బంది పడిన మద్యం ప్రియులకు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి.


