News February 3, 2025
కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు

కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 25, 2026
నిర్మల్: పుర పోరు.. 40 నామినేషన్ కేంద్రాలు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతి రెండు వార్డులకు ఒకటి చొప్పున 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 27 మంది ఆర్‌ఓలు, 27 మంది ఏఆర్‌ఓలు, 13 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇప్పటికే వార్డులు, ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు కాగా, షెడ్యూలు వెలువడటమే తర్వాయి అని అధికారులు వెల్లడించారు.
News January 25, 2026
NGKL: మున్సిపల్ పోరుకు సిద్ధం.. ఇన్చార్జిల నియామకం!

నాగర్ కర్నూల్ జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, కల్వకుర్తికి మాజీ కార్పొరేషన్ రాజీవ్ సాగర్, కొల్లాపూర్‌కు ఉప్పల వెంకటేష్ గుప్తా, అమన్‌గల్‌కు రజిని సాయిచందు ను నియమించారు.
News January 25, 2026
తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


