News February 1, 2025
కోనరావుపేట: ఈత చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడికి గాయాలు

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఏగోలపు మల్లేశం గౌడ్ శుక్రవారం ఈత చెట్టు నుంచి పడి గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన మల్లేశం గౌడ్ ఈత చెట్టు ఎక్కుతుండగా మోకుజారి కింద పడిపోయాడు. దీంతో గాయాలైన గీత కార్మికున్ని తోటి కార్మికులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మల్లేశం గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News November 23, 2025
భీమ్గల్: 11 ఎకరాలను విరాళంగా ఇచ్చిన మహేశ్ గౌడ్

TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన సొంత గ్రామమైన రహత్ నగర్పై దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 10 ఎకరాలు, సబ్స్టేషన్కు 1 ఎకరాన్ని అందజేసి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు.
News November 23, 2025
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్’ను చార్మినార్లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.


