News February 8, 2025

కోనరావుపేట: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌‌‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.

Similar News

News February 8, 2025

వరంగల్ ఇన్‌ఛార్జి డీటీఓగా శోభన్ బాబు

image

వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 8, 2025

BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం

image

KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

News February 8, 2025

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

error: Content is protected !!