News September 23, 2024
కోనరావుపేట: నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్
కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News October 14, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,23,033 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.67,998, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,890, అన్నదానం రూ.14,145 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
News October 14, 2024
రాయికల్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచి ఆడి పాడి నేడు మహిళలు, యువతులు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, చెరువులలో నిమజ్జనం చేశారు.
News October 14, 2024
కరీంనగర్: ముమ్మరంగా రేషన్ కార్డుల సవరణ!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రేషన్ కార్డులలో లోపాలను సవరిస్తున్నారు. అనర్హులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరణించినవారు, వివాహమై అత్తింటికి వెళ్లిన మహిళలు తదితరులను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 9 నెలల వ్యవధిలోనే 1,186 రేషన్ కార్డులను రద్దు చేసి 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు.