News February 2, 2025
కోనరావుపేట: నాటు సారా అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు

కోనరావుపేట మండలంలో ముగ్గురు వ్యక్తులు నాటు సారా అమ్మగా కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం తనిఖీలు చేయగా మండలంలోని వడ్డెర కాలనీ, కనగర్తి, మామిడిపల్లి, నిజామాబాద్, మరిమడ్ల గ్రామాలలో నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు. వారి వద్ద 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
News November 14, 2025
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.


