News February 2, 2025
కోనరావుపేట: నాటు సారా అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు

కోనరావుపేట మండలంలో ముగ్గురు వ్యక్తులు నాటు సారా అమ్మగా కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం తనిఖీలు చేయగా మండలంలోని వడ్డెర కాలనీ, కనగర్తి, మామిడిపల్లి, నిజామాబాద్, మరిమడ్ల గ్రామాలలో నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు. వారి వద్ద 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 13, 2025
వంశీ అరెస్టు సరికాదు: బొత్స

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.
News February 13, 2025
భీంపూర్‌లో చిరుత.. స్పందించిన అధికారులు

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.