News March 14, 2025

కోనరావుపేట: మహిళ అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు

image

కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన దొంతరవేణి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైంది. ఊరికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త రాజయ్య కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కాగా, ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712656421 కు కాల్ చేయాలని ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Similar News

News December 10, 2025

వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

image

3నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్‌లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.

News December 10, 2025

విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

image

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.

News December 10, 2025

కామారెడ్డి: ఓటరు ID లేకున్నా ఓటు వేయవచ్చు: కలెక్టర్

image

ఓటరు ID లేకున్నా అర్హులు ఓటు వేయవచ్చని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వివిధ ప్రభుత్వ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు సహా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని వెల్లడించారు. ఓటరు స్లిప్‌ను tsec.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.