News February 6, 2025

కోనసీమలో బైక్ దొంగలు దొరికారు..!

image

కోనసీమలో బైకులను అపహరిస్తున్న వారిని అరెస్ట్ చేశామని అమలాపురం డీఎస్పీ SKVD ప్రసాద్ వెల్లడించారు. వీరి నుంచి  రూ.9 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు పట్టుబడగా.. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.

Similar News

News February 27, 2026

HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

image

​శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.

News February 27, 2026

సిరిసిల్ల: పోక్సో కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

image

ఎల్లారెడ్డిపేట మండలంలో 2021లో నమోదైన ఓ <<19250331>>పోక్సో కేసు<<>> విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికపై వరుసకు సోదరుడైన తూర్పాటి ప్రవీణ్ వేధింపులకు పాల్పడగా, ఆ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అతని తండ్రి జాని, నానమ్మ పోచవ్వ బాధితురాలిని చంపేస్తామని బెదిరించారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు నిరూపితమవడంతో రక్షించాల్సిన కుటుంబ సభ్యులే నేరానికి సహకరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News February 27, 2026

మంత్రిని కలిసిన యాదాద్రి కలెక్టర్

image

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు మంత్రి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్‌కు మంత్రి సూచించారు.