News February 6, 2025

కోనసీమలో బైక్ దొంగలు దొరికారు..!

image

కోనసీమలో బైకులను అపహరిస్తున్న వారిని అరెస్ట్ చేశామని అమలాపురం డీఎస్పీ SKVD ప్రసాద్ వెల్లడించారు. వీరి నుంచి  రూ.9 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు పట్టుబడగా.. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.

Similar News

News February 18, 2026

పాక్‌తో వివాదం.. ఇండియా నుంచి తరలిపోనున్న ICC ఈవెంట్లు?

image

పాక్‌తో వివాదాల ఎఫెక్ట్ ఇండియాలో జరగాల్సిన ICC టోర్నీలపై పడినట్లు తెలుస్తోంది. 2029 CT, 2031 ODI WC బాధ్యతలు ఇంకో దేశానికి అప్పగించాలని ICC భావిస్తున్నట్లు The Age తెలిపింది. ఈ రేసులో AUS ముందున్నట్లు చెప్పింది. ఇండియాలో టోర్నీలు నిర్వహిస్తే బంగ్లా, పాక్‌తో మళ్లీ <<19058725>>గొడవలు<<>> ఏర్పడొచ్చని ICC ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. T20 WC నుంచి బంగ్లా వైదొలగగా, పాక్ బాయ్‌కాట్ డ్రామాలాడటం తెలిసిందే.

News February 18, 2026

అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.

News February 18, 2026

పాలమూరు: మెగా జాబ్ మేళా

image

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 19న ఉ.10.30 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, పిల్లలమర్రి రోడ్డులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ తెలిపారు. మొత్తం 4 ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 200 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. SSC, ఇంటర్, డిగ్రీ, ITI, ఫార్మసీ అర్హతలున్న 18-30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు పాల్గొనవచ్చని ఆమె పేర్కొన్నారు.