News August 21, 2024

కోనసీమ: ఈనెల 23న వానపల్లిలో సీఎం రాక

image

కోనసీమ జిల్లా వానపల్లికి ఈనెల 23న రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్రామసభ కార్యక్రమాన్ని చంద్రబాబు వానపల్లి వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆ గ్రామంలో అనుకూలమైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పరిశీలించారు.

Similar News

News September 19, 2024

ఉండ్రాజవరం: కత్తెరతో భర్తను హత్య చేసిన భార్య

image

ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

News September 19, 2024

గోకవరం: ఆర్టీసీ బస్సులో 30 కిలోల గంజాయి సీజ్

image

గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గోకవరం పోలీసులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్సులోని అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 30 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టామన్నారు.

News September 19, 2024

తూ.గో.: ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలో ప్రవేశం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి నాలుగో విడత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని రాజమండ్రి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రాధా రామకృష్ణన్ బుధవారం కోరారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో వెబ్‌సైట్ ద్వారా 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు.