News March 19, 2024
కోనసీమ: ఉద్యోగం రావట్లేదని యువకుడు SUICIDE

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నల్లి శ్రీకాంత్ కుమార్ (23) బీటెక్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఆదివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతణ్ని రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 23, 2025
సమస్య మీది.. పరిష్కారం మాది: తూ.గో కలెక్టర్

ఈనెల 24న కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను ముందుగానే ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
News November 23, 2025
జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తూర్పుగోదావరి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (2026-27) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. పాత కార్డుల గడువు ఈ నెల 30తో ముగుస్తుండటంతో నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్హులైన పాత్రికేయులు సమాచార పౌర సంబంధాల శాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని, నూతన కార్డులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయని ఆమె వెల్లడించారు.
News November 23, 2025
సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.


