News March 24, 2025

కోనసీమ: ఉప సర్పంచ్ ఎన్నికకు మోగిన నగారా

image

కోనసీమలో ఈ నెల 27న ఉప సర్పంచ్ ఎన్నిక కింది గ్రామాల్లో జరుగనున్నాయి. అల్లవరం (M) ఎంట్రికోన, అంబాజీపేట(M) మాచవరం, అయినవిల్లి(M) పోతుకుర్రు, రామచంద్రాపురం(M) నెలపర్తిపాడు, ఆత్రేయపురం(M) పులిదిండి, రాయవరం(M) వెదురుపాక, రాయవరం, ఐ.పోలవరం(M) జిమూలపొలెం, ముమ్మిడివరం(M) సిహెచ్గున్నేపల్లి, రాజోలు(M) సోంపల్లి, శివకోటి, ఆలమూరు(M) మోదుకూరు, కొత్తపేట, మలికిపురం(M) లక్కవరం, చింతలమోరి, మోరిపోడు, అంతర్వేదిపాలెం.

Similar News

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.

News November 21, 2025

వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

image

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. అక్టోబర్ 22 నుంచి నవండర్ 20 వరకు ఆర్జిత సేవలు, ఇతర టికెట్ల ద్వారా రూ.4,00,06,720, హుండీల లెక్కింపు ద్వారా రూ.4,22,60,841 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయం 8 కోట్ల 22 లక్షల 67 వేల 561 రూపాయల లభించినట్లు వివరించారు.