News March 23, 2024
కోనసీమ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఆలమూరు మండలం జొన్నాడలో అనంతపురం జిల్లాకు చెందిన ఊదపల్లి రమేష్ బాబు (45) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆలమూరులో నివాసముంటున్న సోదరుడు రామకృష్ణ ఇంటికి గత నెల 19వ తేదీన రమేష్ బాబు డబ్బుల కోసం వచ్చాడన్నారు. చెడు వ్యసనాలకు, మద్యానికి బానిస కావడం, అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 16, 2025
తూ.గో: TDP జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకట రమణ చౌదరి?

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. వెంకట రమణ చౌదరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.
News December 16, 2025
విద్యుత్.. అమూల్య సంపద: కలెక్టర్

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.


