News March 24, 2024
కోనసీమ: ‘ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి’

ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు.
Similar News
News November 15, 2025
తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.
News November 15, 2025
దివాన్ చెరువులో కొత్త బిల్డింగ్‌కు రూ.3కోట్లు

రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, సబ్-డివిజన్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన భవనాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట ఉండేలా దివాన్ చెరువులో కొత్తగా భవనం నిర్మించనున్నారు. దీని కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజకి కృతజ్ఞతలు తెలిపారు.
News November 14, 2025
రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.


