News April 12, 2025
కోనసీమ: ఏప్రిల్ 15 నుంచి సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం

ఏప్రిల్ 15 తేదీ నుంచి జూన్ 14 వరకు సముద్ర జలాల్లో చేపల వేటను ప్రభుత్వం నిషేధం విధించినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు, మేకనైజిడ్, మోటారైజ్డ్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను నిలిపివేయాలన్నారు. 61 రోజులు పాటు చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Similar News
News January 22, 2026
బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం: MLA కిమిడి

ఉపాధి హామీ పథకం విషయంలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని బొత్స చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుతం వేతనదారులకు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఆరోపణలు చేయడమే తప్ప జిల్లాకు మీ వల్ల జరిగిన మేలేమిటో చెప్పాలన్నారు.
News January 22, 2026
నందిగామలో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీశ

నందిగామ మండలం కంచలలో గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. హార్టికల్చర్ శాఖలో భాగంగా మునగ, మామిడి తోటలను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కొత్త కంచల గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన గోకులం షెడ్లను పరిశీలించారు.
News January 22, 2026
అధిక స్క్రీన్ టైమ్‌తో పిల్లల హార్ట్‌కు రిస్క్

పిల్లలు ఫోన్లు, TVలకు గంటల తరబడి అతుక్కుపోవడం వల్ల వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ BP, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను పెంచి గుండెకు ముప్పును తలపెడుతోంది. నిద్ర తక్కువైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మొబైల్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు తగినంత నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూడాలని స్టడీ సూచించింది.


