News August 20, 2024

కోనసీమ కలెక్టర్ ఫొటో డీపీగా పెట్టుకొని మెసేజ్‌లు

image

కొందరు తన పేరిట సందేశాలు పంపిస్తున్నారని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులతో పాటు ఇతరులకు సందేశాలు పంపిస్తున్నారని వివరించారు. ఆ ఫోన్ నంబర్ (94785566071) తనది కాదని, వారు పంపే సందేశాలకు రెస్పాండ్ కావద్దని సూచించారు. కాల్స్‌ కూడా స్వీకరించొద్దంటూ కలెక్టరే‌ట్ నుంచి మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 18, 2024

అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు

image

అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

News September 18, 2024

గంగవరం: విద్యార్థినులతో HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్

image

గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.

News September 18, 2024

సినిమా చూపిస్తూ.. కాకినాడ జీజీహెచ్‌లో ఆపరేషన్

image

కాకినాడ జీజీహెచ్‌లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ ఇవ్వకుండా సినిమా చూపిస్తూ మెదడులో కణతి తొలగించామన్నారు. ఆమె 15 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర విభాగానికి రాగా.. మెదడులో కణతి ఉందని గుర్తించారు. అవేక్ క్రేనియటోమీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.