News August 13, 2024

కోనసీమ: గల్ఫ్‌లో పేరెంట్స్.. బీచ్‌కి వెళ్లి బాలుడి మృతి

image

21న విశాఖలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాల్సిన విద్యార్థి స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద సోమవారం కాలువలో గల్లంతై సందీప్(17) మృతి చెందిన విషయం తెలిసిందే. పి.గన్నవరం మండలం పెదకందాలపాలానికి చెందిన సందీప్ పేరెంట్స్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. దీంతో అన్నదమ్ములు అమలాపురం మండలం వన్నెచింతలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.

Similar News

News November 22, 2025

“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.

News November 22, 2025

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు: శశాకం

image

సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.