News February 16, 2025
కోనసీమ: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ట్రెడర్లు బర్డ్ ప్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.
Similar News
News January 4, 2026
తనకు దక్కని ‘శాంతి’ వెనిజులాకు దక్కిందని!

వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ దేశం కొన్నాళ్లు తమ అధీనంలో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఆయన ఎంతగానో ఆశపడ్డ నోబెల్ పీస్ ప్రైజ్ గతేడాది వెనిజులా నేత మరియాకు దక్కింది. దీంతో ఆ దేశంపై అక్కసుతోనే ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటున్నారని SMలో పలువురు పోస్టులు పెడుతున్నారు. తనకు దక్కని ‘శాంతి’ని దక్కించుకున్న దేశంలో అశాంతి నెలకొల్పాలనే దాడులకు దిగినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ COMMENT.
News January 4, 2026
సంగారెడ్డి: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

సమాజంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని, దానిని అరికట్టే శక్తి ప్రజల చేతుల్లోనే ఉందని ఉమ్మడి మెదక్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. లంచం అడగడం, తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
News January 4, 2026
రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ధన్వాడ విద్యార్థుల ఎంపిక

జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజేందర్, ప్రవీణ్ ప్రతిభ కనబరిచారు. రసాయనాలు లేకుండా ‘సేంద్రీయ వ్యవసాయం’పై వారు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. డీఈఓ రవీందర్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.


