News May 18, 2024
కోనసీమ: గోదావరిలో ముగ్గురు గల్లంతు.. ఇద్దరు మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం రావులపాలెం వద్ద గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరొక యువకుడు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కందుల

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలిగామని మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ప్రకటించారు. 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SLIPB) సమావేశంలో రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. 26 సంస్థల ఏర్పాటుకు అనుమతివ్వడం ద్వారా 56,278 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు.
News December 4, 2025
RJY: 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
News December 4, 2025
నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లు మండలం దారావరం గ్రామానికి చెందిన షైక్ నాగూర్ బేబీ ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్ చొరవ, వికాస సంస్థ కృషి కారణంగా నాగూర్ బేబీ సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె గురువారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


