News February 28, 2025

కోనసీమ: ‘జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలి’

image

రామచంద్రపురం పట్టణంలో గురువారం అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో రామచంద్రపురం 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి ఎన్. శంకరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. గతంలో రామచంద్రపురం నుంచి ఎక్కువ సంఖ్యలో లోక్ అదాలత్‌కు కేసులు వచ్చేలా న్యాయవాదులు సహకరించారని అన్నారు. ఆ పరంపర కొనసాగాలన్నారు.

Similar News

News November 23, 2025

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్

image

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్‌ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్‌లో మూడో సూపర్‌ 500 టైటిల్‌.

News November 23, 2025

బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

image

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.

News November 23, 2025

సూర్యాపేట జిల్లాలో మెడికల్ దందా

image

జిల్లాలో మెడికల్‌ షాపుల్లో దందా ఇష్టరాజ్యమైంది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వారే డాక్టర్లా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు అమ్ముతున్నారు. జిల్లాలో సుమారు 700 మెడికల్ షాప్‌లు రిజిస్టర్ కాగా.. అనధికారికంగా మరో వందకు పైగా షాపులు ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యుడి చీటి లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.